అమెరికా ప్రభుత్వం చైనా నుంచి వచ్చే వారికి నూతన కొవిడ్ నిబంధనలు జారీ చేసింది. చైనా నుంచి అమెరికాకు వచ్చే వారు తప్పకుండా రెండ్రోజుల ముందు కరోనా టెస్ట్ చేయించుకుని నెగెటివ్ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. చైనా మీదుగా వస్తూ అక్కడ కనీసం 10 రోజులు ఉన్న ఇతర దేశస్థులకు కూడా ఇదే నియమం వర్తిస్తుంది. జనవరి 5 నుంచి నూతన నిబంధనలు అమల్లోకి వస్తాయి. చైనాలో కరోనా కల్లోలం సృష్టిస్తున్న వేళ US గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది.