విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో యువసామ్రాట్ నాగచైతన్య నటిస్తున్న మూవీ ‘థాంక్యూ’. జులై 8వ తేదీన విడుదల కానున్న ఈ మూవీలో రాశీఖన్నా, మాళవిక నాయర్, అవికాగోర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఓ సాంగ్, టీజర్ ఆకట్టుకోగా.. తాజాగా మూవీ యూనిట్ విడుదల చేసిన ‘నాతో నువ్వెంటో.. నీతో నేనేంటో’ అంటూ సాగే సాంగ్ ఆకట్టుకుంది. మాళవిక నాయర్, చైతూ మీద సాగుతున్న ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను కట్టిపడేస్తోంది. కాగా ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.