మారుతి సుజుకీ అనుబంధ సంస్థ సుజుకీ మోటార్స్ మరో స్కూటీని మార్కెట్లోకి తీసుకొచ్చింది. బర్గ్‌మన్ స్ట్రీట్ వాహనానికి అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా బర్గ్‌మన్ స్ట్రీట్ ఈఎక్స్ని విడుదల చేసింది. బ్లూటూత్ డిజిటల్ ఎనేబుల్డ్ కన్సోల్ ఫీచర్‌తో ఇది ఆకట్టుకుంటోంది. బ్లూటూత్ ద్వారా మన ఫోన్‌ని సింక్ చేసుకోవచ్చు. దీంతో కాలే డేటా, సందేశాలు, అలర్ట్స్, బ్యాటరీ సామర్థ్యం వంటివాటిని బైక్ డిస్ప్లేలో చెక్ చేసుకోవచ్చు. మెటాలిక్ రాయల్ బ్రాంజ్, మ్యాట్ బ్లాక్ కలర్, ప్లాటినమ్ సిల్వర్ రంగుల్లో ఇది లభ్యమవుతోంది. 124సీసీ మోటారు ఇంజిన్‌తో రూపొందించిన ఈ స్కూటీ ధరను రూ.1,12,300(దిల్లీ ఎక్స్ షోరూం)గా సంస్థ నిర్ణయించింది.
మార్కెట్లోకి కొత్త సుజుకీ స్కూటీ

Courtesy: Suzuki MotorCycle