వచ్చే ఏడాదికి కొత్త టెలికాం బిల్లు

© Envato

కొత్త టెలికాం బిల్లును వచ్చే ఏడాది పార్లమెంట్‌లో ప్రవేశపెడతామని కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కాగా ఇంటర్నెట్ కాలింగ్, మెసేజింగ్ వంటి సర్వీసులు అందించే ఓవర్ ది టాప్(ఓటీటీ) సంస్థలను కూడా కేంద్ర టెలికాం లైసెన్సుల పరిధిలోకి తీసుకువచ్చేలా టెలీ కమ్యూనికేషన్ బిల్లు 2022 ముసాయిదాను కేంద్రం తయారుచేసింది. దీంతో వాట్సాప్, జూమ్, గూగుల్ డ్యుయో వంటి సంస్థలు ఇకపై దేశీయంగా కార్యకలాపాలు నిర్వహించాలంటే లైసెన్సులు తీసుకోవాల్సిందే. లైసెన్సుల కోసం కేంద్రానికి కొంతమేర ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Exit mobile version