టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్ సెమీస్ రేసులో దూసుకెళ్తోంది. ఆడిన మూడు మ్యాచుల్లో రెండు విజయాలతో గ్రూపు 1లో టాప్ ప్లేసులో కొనసాగుతోంది. శ్రీలంకతో జరిగిన మ్యాచులో 65 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ప్రత్యర్థిరి 168 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. గ్లెన్ ఫిలిప్స్ అద్భుత శతకం చేశాడు. ఇక బౌలింగులో లంక బ్యాటర్లకు చుక్కలు చూపించారు. బౌల్ట్ 4 వికెట్లు తీసి లంక పతనాన్ని శాసించాడు. సౌధీ, సోది, ఫెర్గూసన్ రాణించారు. స్కోర్లు NZ 165/7; SL 102/10.