తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు ఎండలు దంచికొడుతుండగా, మరోవైపు కొన్ని చోట్ల వానలు కూడా కురుస్తున్నాయి. తెలంగాణ, ఏపీలో ఇవాళ, రేపు పలు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం కారణంగా ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం తెలంగాణలో 31 ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. మరోవైపు శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా రికార్డయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ లో 44.9 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది.