రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో జరిగిన నవీన్ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న యువతి విడుదలయ్యింది. ఏ3గా ఉన్న ఆమెకు రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హత్య కేసులో ప్రధాన నిందితుడు హరిహరకృష్ణకు సహకరించినందుకు అతడి స్నేహితుడు హసన్‌తో పాటు యువతి నిహారికను నిందితులుగా చేర్చారు. హత్య చేసినట్లు సమాచారం ఇచ్చినా వారు పోలీసులకు చెప్పకపోవటం, హరిహర కృష్ణ, నిహరికా మధ్య సంభాషణల ఆధారంగా నిందితులుగా పేర్కొన్న సంగతి తెలిసిందే.