యంగ్ హీరో నిఖిల్ తన తర్వాత సినిమాను ప్రకటించాడు. ‘స్పై’ అనే యాక్షన్ థ్రిల్లర్‌లో నిఖిల్ నటించబోతున్నాడు. పాన్ ఇండియా మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. స్పై మూవీ గ్లింప్స్‌ను తాజాగా విడుదల చేశారు. గ్యారీ బీహెచ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ ‘స్పై’ మూవీని నిర్మిస్తుంది. ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.