నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS)కు త్వరలో జీనోమ్ సీక్వెన్సింగ్‌ను అత్యంత వేగంగా నిర్వహించగల నెక్స్ట్ జనరేషన్ సిస్టమ్ అందుబాటులోకి రానుంది. దేశంలోని కొన్ని నగరాల్లో మాత్రమే ఇలాంటి సిస్టమ్ ఉండగా.. ఇప్పుడు తెలంగాలోని నిమ్స్‌కు రావడం విశేషం. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) తర్వాత, తెలంగాణలో అత్యంత ఆధునిక సిస్టమ్ ఇదే అని అధికారులు చెబుతున్నారు. దీనిని సమకూర్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే టెండర్లను సైతం ఆహ్వానించింది.