నిరీక్షణ సినిమాతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది సీనియర్ నటి అర్చన. దాసి, లేడీస్ టైలర్, భారత్ బంద్ వంటి చిత్రాల్లోనూ నటించింది. అయితే చాలా కాలం గ్యాప్ తర్వాత ఆకాశ్ పూరీ హీరోగా నటించిన చోర్ బజార్‌లో ఒక కీలక పాత్ర పోషించింది. ఇంతకాలం ఎందుకు సినిమాల్లో నటించలేదు అని ఆమెను అడగ్గా..హీరోయిన్లకు పెళ్లి తర్వాత అక్క, అమ్మ, అత్త వంటి పాత్రలే వస్తాయి. అలాంటి రోల్స్ కోసం నన్ను చాలా మంది అడిగారు. కానీ నేను నో చెప్పాను. చోర్ బజార్ సినిమాలో నా పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. అమితాబ్ బచ్చన్ వీరాభిమానిగా నటించాను. ఆయనపై ప్రేమతో పెళ్లి కూడా చేసుకోని పాత్ర అది. ఒక సీన్‌లో నిరీక్షణ సమయంలో ఉన్నంత యంగ్‌గా కనిపిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. చోర్ బజార్ సినిమా జూన్ 24న విడుదల కానుంది. జీవన్ రెడ్డి దీనకి దర్శకత్వం వహించాడు.