కామారెడ్డి జిల్లా కలెక్ట‌ర్‌పై నిర్మ‌లా సీతారామ‌న్ ఫైర్

© File Photo

కేంద్ర‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కామారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గ‌త రెండురోజులుగా కామారెడ్డిలో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆమె రేష‌న్‌లో కేంద్ర‌, రాష్ట్ర వాటా ఎంత ఉంటుంద‌ని క‌లెక్ట‌ర్‌ను ప్ర‌శించారు. దీనికి క‌లెక్ట‌ర్ నాకు తెలియ‌ద‌ని స‌మాదానం ఇచ్చింది. దీంతో ఐఏఎస్ ఆఫీస‌ర్ అయిన మీకు ఈ విష‌యాలు తెలియ‌వా అంటూ ఫైర్ అయ్యారు. అర‌గంట‌లో తెలుసుకొని త‌న‌కు చెప్పాల‌ని ఆదేశించారు. నిన్న జిల్లాలో ప‌ర్య‌టించిన కేంద్రమంత్రి నిర్మల …. సీఎం కేసీఆర్, తెలంగాణ ప్ర‌భుత్వ తీరుపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

Exit mobile version