దిల్లీలో బీజేపీ జాతీయ కార్యనిర్వహక సమావేశం సోమవారం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారమన్ వ్యాఖ్యలు చేశారు. జేపీ నడ్డా పదవీ కాలం పొడిగింపుపై కార్యనిర్వహక సమావేశంలో ఏమైనా నిర్ణయం తీసుకున్నారా? అని విలేకరులు ఆర్థికమంత్రిని ప్రశ్నించారు. అయితే, అలాంటి చర్చేమీ సమావేశంలో జరగలేదని నిర్మలా సీతారామన్ తేల్చిచెప్పారు. మరోవైపు, ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో 9 రాష్ట్రాల్లో జయకేతనం ఎగరవేయాలని ప్రధాని మోదీ కార్యకర్తలకు సూచించినట్లు సమాచారం.