నేటి నుంచి ‘నిరుద్యోగ రణం’ యాత్ర

Screengrab Twitter:

ఏపీలో నేటి నుంచి తెలుగు యువత ఆధ్వర్యంలో ‘నిరుద్యోగ రణం’ యాత్రను చేపట్టనున్నారు. ఈనెల 29 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు తెలిపారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఈ యాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఏపీలో 2.30 లక్షల ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని శ్రీరామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గెలిస్తే ఉద్యోగాలిస్తామన్న జగన్ మూడేళ్లు దాటినా నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని ఈ సందర్భంగా శ్రీరామ్ కోరారు.

Exit mobile version