తెలంగాణకు చెందిన నలుగురు మహిళలకు అరుదైన గౌరవం దక్కింది. వీరు నీతి ఆయోగ్ ఐదో ఎడిషన్ ఉమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నుంచి అవార్డులు సొంతం చేసుకున్నారు. రాష్ట్రం నుంచి ఎంపికైన వారిలో అను ఆచార్య, మాగంటి రూప, అబ్బూరి తనూజ, విజయ స్విత ఉన్నారు. మొత్తం దేశవ్యాప్తంగా 75 మంది మహిళలు ఎంపికయ్యారు. దేశాన్ని సశక్త్ ఔర్ సమర్థ్ గా మార్చడంలో ఈ ఉమెన్స్ విశేష కృషికి గాను ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా అవార్డులు అందజేస్తున్నట్లు ప్రకటించారు.