కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల చేసిన ప్రకటనతో పలు టోల్ ప్లాజాలు రద్దుకానున్నాయి. 60 కిలోమీటర్ల లోపు కేవలం ఒకటే టోల్ ప్లాజా ఉండాలని గడ్కరీ స్పష్టం చేశారు. అంతకు మించి ఉంటే 3 నెలల్లోపు వాటిని మూసివేస్తామన్నారు. ఈ క్రమంలో NH-65 రహదారిపై కీసర, చిల్లకల్లు వద్ద రెండు ఉన్నాయి. వీటి మధ్య కేవలం 31 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. దీంతో ఈ రెండింటిలో ఒకటి రద్దు కానుంది. మరోవైపు NH-16 హైవేపై పొట్టిపాడు, కరపర్రు వద్ద 18 కిలోమీటర్ల పరిధిలో 2 టోల్ ప్లాజాలు ఉన్నాయి. వీటిలో కూడా ఒక దానిని తొలగించనున్నారు.