నితిన్ కథా నాయకుడిగా నటిస్తున్న ‘మాచర్ల నియోజకవర్గం’ మూవీలో బాలీవుడ్ సుందరి ఊర్వశీ రౌటేలా ఆడిపాడనుందట. ఇప్పటికే చిత్ర యూనిట్ ఆమెతో సంప్రదింపులు కూడ జరిపినట్లు సమాచారం. పొలిటికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీకి ఎమ్.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో నితిన్ మాస్ లుక్‌లో కనిపించనున్నాడు. ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది.