ఏ ఫార్మాట్‌లోనైనా నో బాల్స్ వేయడం క్షమించరాని నేరమని భారత టీ20 జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. రెండో టీ20 మ్యాచ్ అనంతరం పాండ్యా మాట్లాడుతూ..‘‘రెండో టీ20 పవర్‌ప్లేలో రెండు విభాగాల్లో తేలిపో యాం. అటు బ్యాటింగ్‌లో రాణించలేకపోయాం.. ఇటు బౌలింగ్‌లో వికెట్లు పడగొట్టలేకపోయాం. కనీస బేసిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని బౌలింగ్ చేయాలి. ఒక్క అర్షదీప్ గురించే కాదు. అందరూ నో బాల్స్‌పై దృష్టి పెట్టాలి. నో బాల్స్ వేయడం నా దృష్టిలో నేరమే.’’ అంటూ పేర్కొన్నాడు.