పెగాసస్‌పై కేంద్రం సహకారం లేదు: నిపుణుల కమిటీ

© ANI Photo

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇజ్రాయేల్ స్పై వేర్ పెగాసస్ కేసుపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈమేరకు నియమించిన నిపుణుల కమిటీ దర్యాప్తు వివరాలను కోర్టుకు విన్నవించింది. పెగాసస్ దర్యాప్తులో కేంద్రం సహకరించడం లేదని వివరించింది. ఇప్పటి వరకు దేశంలోని 29మంది ప్రమఖుల సెల్‌ఫోన్‌లు పరిశీలించామని తెలిపింది. ఆ సెల్‌ఫోన్లలోని ఐదింటిలో మాల్‌వేర్ గుర్తించినట్లు వెల్లడించింది. అయితే అది పెగాసస్ అవునో కాదో తాము చెప్పలేమని పేర్కొంది. పెగాసస్ మాల్‌ వేర్‌ను రాజకీయనాయకుల కదలికలను తెలుసుకునేందుకు కేంద్రం ఉపయోగిస్తోందని గతేడాది ప్రతిపక్షాలు పెద్దఎత్తున ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే.

Exit mobile version