రిజర్వేషన్ల పరిమితులపై సండలింపులు ఇచ్చే ఆలోచన లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈడబ్ల్యూఎస్ కింద 10 శాతం కల్పించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించడంతో బీసీలకు 27 శాతం మించి కల్పిస్తారా అని లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. అలాంటి ప్రతిపాదన కేంద్రం వద్ద లేదని వెల్లడించారు. రిజర్వేషన్ కోటాలో ఎలాంటి మార్పులు చేసే ఉద్దేశం లేదన్నారు. పార్లమెంటరీ స్థాయి సంఘాల ఛైర్మన్ పదువుల విషయంలోనూ లోక్ సభలో ఆందోళన జరిగింది.