పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ప్రతిపక్షాలు పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ప్రతిపక్షనేత, పీఎంఎల్-ఎన్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ ఇందుకు సంబంధించి తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ ఖాసిమ్ ఖాన్ సూరికి అందించారు. అవిశ్వాసంపై చర్చ జరిగేందుకు 161 మంది అనుకూలంగా ఓటు వేశారు. ఈనెల 31న ఈ అంశంపై ఓటింగ్ నిర్వహించనున్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే విపక్షాలకు 172 మంది మద్దతు పలకాలి.