పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు కాస్త ఉపశమనం లభించింది. ఆయనపై అవిశ్వాసం తీర్మానం పెట్టకుండానే శుక్రవారం ఆ దేశ పార్లమెంట్ మార్చి 28కి వాయిదా పడింది. ఇటీవల మరణించిన పలువురు నేతలకు నివాళులర్పించిన అనంతరం పార్లమెంట్ స్పీకర్ అసద్ ఖైసర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, అవిశ్వాసం తీర్మానం ప్రవేశ పెట్టనున్నారని భావించిన ప్రతిపక్ష నేతలు పార్లమెంటుకు హాజరయ్యారు. కానీ, అవిశ్వాస తీర్మానంపై చర్చించకుండానే స్పీకర్ వాయిదా వేయడంతో నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత షెహబాజ్ షరీఫ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ భుట్టో-జర్దారీ, కో-చైర్ అసిఫ్ అలీ జర్దారీతో సహా పలువురు ప్రముఖ ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలిపారు.