జాతీయ స్థాయిలో భారతీయ పౌరుల జాతీయ రిజిస్టర్ (NRIC)ని సిద్ధం చేయడానికి భారత ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ మేరకు కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మంగళవారం లోక్ సభలో తెలిపారు. లోక్సభ ఎంపీ మాలా రాయ్ దేశం మొత్తానికి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) స్థితి గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, ఎన్ఆర్సీ, అసోంకి సంబంధించిన అనుబంధ జాబితాలు, మినహాయింపుల జాబితాను ఆగస్టు 31, 2019న ప్రచురించారని తెలిపారు.