దిల్లీలో 24 గంటలూ కరెంట్ ఉండదు: కేసీఆర్

cmo

మేడ్చల్‌- మల్కాజ్‌గిరి సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతూ, రాష్ట్రంతో కేంద్ర పరిస్థితులను పోల్చారు. హైదరాబాద్‌లో అసలు కరెంట్‌ పోదని, దిల్లీలో మాత్రం 24 గంటలూ కరెంట్ ఉండదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఉన్న కలెక్టరేట్లలా ఇతర రాష్ట్రాల్లో సెక్రటేరియట్లు కూడా లేవని స్పష్టం చేశారు. దేశ పరిణామాలపై గ్రామ గ్రామానా చర్చ జరగాలని పిలుపునిచ్చారు. భారతదేశాన్ని మతం,కులం పేరిట విడదీస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారని కేసీఆర్‌ విమర్శించారు. చైనా,సింగపూర్‌, కొరియా బాటలో భారత్‌ నడవాలని ఆకాంక్షించారు. విచ్చిన శక్తులను ఐకమత్యంతో ఎదిరించాలని పిలుపునిచ్చారు.

Exit mobile version