జట్టు బ్యాటింగ్‌లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. బంగ్లాదేశ్‌తో ఓటమిపై స్పందించిన రోహిత్..పిచ్ కాస్త సవాలుతో కూడికున్నదని..బంతి టర్న్ అయ్యిందని పేర్కొన్నాడు. ఓటమికి ఎలాంటి సాకులు చెప్పట్లేదని వ్యాఖ్యానించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఆడాలో అర్థం చేసుకోవాలని అన్నాడు. 30 40 పరుగులు వెనకబడ్డామని దురదృష్టం కొద్ది మధ్యలో కొన్ని వికెట్లు కోల్పోయామని పేర్కొన్నాడు. ఈ దశలో ఆటలోకి రావటం సులభం కాదన్నాడు.