బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసే నగదుపై ఎలాంటి జీఎస్టీ ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. బ్యాంకులు కొనుగోలు చేసే చెక్‌బుక్‌లపైనే జీఎస్టీ ఉంటుందన్న మంత్రి.. వినియోగదారుల చెక్‌బుక్‌లపై పన్ను ఉండదన్నారు. దేశంలో ధరల పెరుగుదల అంశంపై రాజ్యసభలో మంగళవారం జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా నిర్మల సమాధానం ఇచ్చారు. ఆహార పదార్థాలపై 5శాతం జీఎస్టీ విధించే ప్రతిపాదనకు జీఎస్టీ కౌన్సిల్‌లో అన్ని రాష్ట్రాలూ అంగీకరించాయని చెప్పారు. ఆస్పత్రి పడకలపై జీఎస్టీ లేదని.. రోజుకు రూ.5000 అద్దె చెల్లించే గదులకు మాత్రమే జీఎస్టీ విధించినట్టు తెలిపారు.