సత్రాలు, ఛారిటీ సముదాయాల నుంచి వచ్చే ఆదాయంపై ఎలాంటి GST ఉండదని కేంద్ర ఆర్ధిక శాఖ తాజాగా స్పష్టం చేసింది. అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌కు దగ్గరలో ఉన్న సత్రాలకు GST మినహాయింపు ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ రాఘవ్ చద్దా కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌కు లేఖ రాశారు. దీనిపై స్పందించిన కేంద్రం ఈ మేరకు స్పష్టతనిచ్చింది. కాగా అద్దె గదులపై కేంద్రం 12 శాతం GST విధించిన విషయం తెలిసిందే.