ఉక్రెయిన్ నుంచి భారతీయ పౌరులను తిరిగి తీసుకురావడానికి వచ్చే మూడు రోజుల్లో భారతదేశం 26 విమానాలను నడుపుతుందని ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైన తర్వాత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా మీడియాతో వెల్లడించారు. నిన్న ఒక్కరోజే 1377 మంది దేశానికి తిరిగి వచ్చినట్లు తెలిపారు. ఉక్రెయిన్‌లో 20,000 మంది భారతీయ విద్యార్థులు ఉన్నట్లు ప్రభుత్వం మొదట అంచనా వేయగా ప్రస్తుతం 12,000 మంది అంటే 60 శాతం ఇండియాకు చేరుకున్నారని ఆయన చెప్పారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి అందరు భారతీయులు స్వదేశం చేరుకున్నారని కేంద్రం వెల్లడించింది. ఉక్రెయిన్‌లో ఉన్న మిగతా ఇండియన్స్‌ను తీసుకొచ్చేందుకు వైమానిక దళాలకుచెందిన విమానాలను రంగంలోకి దింపింది.