శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టు( శ్రీవాణి )కు సంబంధించి 50 శాతం నిధులను తితిదే జనరల్ అకౌంట్కు బదిలీ చేస్తున్నారనే వార్తల్లో నిజం లేదని ఈవో ధర్మా రెడ్డి తెలిపారు. ఇందుకోసమే శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లు ఇస్తున్నారనే ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు. “ ఇలాంటివి భక్తులు నమ్మెుద్దు. శ్రీవాణి ట్రస్టుకు ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్ ఉంది. అందులోనే విరాళాలు జమవుతాయి. తితిదే నుంచి ప్రభుత్వానికి సొమ్ము అందే ప్రసక్తే లేదు ” అన్నారు.