• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దేశంలో ఫోర్త్ వేవ్ భయాలు అవసరం లేదు: ICMR

    గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో దేశంలో ఫోర్త్ వేవ్ వస్తుందనే భయాందోళనలు మొదలయ్యాయి. దీనిపై ICMR(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో ప్రస్తుత కేసుల వ్యాప్తిని బట్టి చూస్తే ఫోర్త్ వేవ్ వ్యాప్తి అంతగా ఉండకపోవచ్చని తెలిపింది. అయితే కొన్ని జిల్లాలు, కొన్ని ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి గణనీయంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు ఫోర్త్ వేవ్ గురించి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, కోవిడ్ నిబంధనలు పాటిస్తే సరిపోతుందని ICMR అదనపు డైరెక్టర్ జనరల్ సమీరన్ పాండా సూచించారు.