పొత్తులపై పవన్ కల్యాణ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒంటరిగా నిలబడినా గెలిపిస్తామని నమ్మకం కలిగిస్తే..ఒంటరిగా పోరాటం చేస్తానని అన్నారు. ఓట్లు చీలకుండా జాగ్రత్తపడి వైసీపీని ఓడగొట్టాలని అన్నారు. అందరినీ హింసించేవాడు ఉన్నపుడు..మరికొందరితో కలిసి పోరాడటంలో తప్పులేదని అన్నారు. కులాలు, మతాల పేరుతో ఓటర్లు విడిపోవద్దని విజ్ఞప్తి చేశారు.