పులివెందులలో సీఎం వైఎస్ జగన్‌ను ఓడించే దమ్ము ఎవరికీ లేదని ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. లోకేశ్‌కు దమ్ముంటే పులివెందులలో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, బాలకృష్ణలు తమ పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని ఛాలెంజ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచామని టీడీపీ శునకానందం పొందుతోందని విమర్శించారు. సైకిల్ గుర్తుతో గెలవలేదని ఎద్దేవా చేశారు. సింబల్ ఎలక్షన్లు వస్తే ప్రజలు మళ్లీ జగన్‌కే జై కొడతారని తెలిపారు.