మునావర్ ఫరూఖీ షోకు ఢిల్లీలో నో పర్మిషన్

Screengrab Twitter:

దేశ రాజధాని ఢిల్లీలో స్టాండ్-అప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ షోకు ఢిల్లీ పోలీసులు అనుమతిని తిరస్కరించారు. ఆగస్ట్ 28న జరగాల్సిన షోను ప్రదర్శించేందుకు పోలీసులు నో చెప్పారు. షో నిర్వహణ కారణంగా మత సామరస్యం దెబ్బతినే అవకాశాలున్నాయని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు మునావర్ ఫరూఖీ ప్రదర్శనను రద్దు చేయాలని విశ్వహిందూ పరిషత్ (VHP) ఢిల్లీ పోలీసులకు ఆగస్టు 25న లేఖ రాసింది. మరోవైపు బెంగళూరులో కూడా మునావర్ షోకు పర్మిషన్ లభించలేదు. కానీ హైదరాబాద్‌లో మాత్రం అనుమతి లభించింది.

Exit mobile version