కంటోన్మెంట్‌లో ఇక నుంచి నో టోల్‌ట్యాక్స్

© Envato

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో ఇక నుంచి టోల్‌ట్యాక్స్ ఉండదు. ఈ మేరకు కేంద్రం ఆదేశాలతో కంటోన్మెంట్‌ బోర్డు తీర్మానం చేసింది. ఈ నిర్ణయంతో ఏడాదికి రూ.10 కోట్ల వార్షిక ఆదాయాన్ని కంటోన్మెంట్‌ బోర్డు నష్టపోనుంది. దీంతో ఈ ప్రాంతంలో ప్రయాణించే కమర్షియల్ వాహనాలకు టోల్ ట్యాక్స్ నుంచి ఉపశమనం లభించనుంది. మరోవైపు కోల్పోయిన ఆదాయాన్ని ఇతర మార్గాల ద్వారా భర్తీ చేయాలని బోర్డు కేంద్రాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్థిక కొరతతో ఇబ్బంది పడుతున్న ఈ బోర్డు టోల్‌ట్యాక్స్ రద్దు చేయడం ద్వారా మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని పలువురు బోర్డు సభ్యులు అంటున్నారు.

Exit mobile version