పఠాన్ సినిమాపై వివాదం చెలరేగుతున్న వేళ.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. అసంబద్ధ విషయాలపై అనవసర వ్యాఖ్యలు, రాద్దాంతం మానుకోవాలని ప్రధాని సూచించినట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మోదీ ఈ మేరకు గట్టిగానే చెప్పారని సమాచారం. 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా నేతలకు దిశానిర్దేశం చేసిన మోదీ…పార్టీ అభివృద్ధి అజెండా పక్కకు వెళ్లి..సినిమాలపై చేసిన వ్యాఖ్యలే నిత్యం వార్తల్లో కనిపిస్తున్నాయని, అందుకే అనవసర వ్యాఖ్యలు మానుకోవాలని నేతలకు చెప్పారు.