ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం నోకియా భారత్ మార్కెట్‌లోకి లో-బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. సీ-సిరీస్‌లో భాగంగా సీ-12 ఫోన్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ.5,999 నిర్ణయించింది. 6.3 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్‌ప్లే, 5-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, 3 డీ ప్యాటర్న్ డిజైన్‌తో ఈ ఫోన్ ఆకట్టుకుంటోంది. అంతేగాక 2 జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీతో ఫోన్ వస్తోంది. ఈ నెల 17 నుంచి అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు. డార్క్ క్యాన్, చార్‌కోల్, లైట్ మింట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
-
Courtesy Twitter:@Jeastsolutions
-
Courtesy Twitter:@Gadgetsdata