బిగ్‌బాస్‌లో ఈవారం నామినేషన్స్ రచ్చ మూమూలుగా లేదు. టాప్ 5 వెళ్లేందుకు ఎవరికి అర్హత లేదో చెప్పాలంటూ నిన్న బిగ్‌బాస్ ఆదేశించాడు. ఇక మొదట బిందుమాదవి నటరాజ్‌ను నామినేట్ చేయడంతో చాలా సేపు గొడవ జరిగింది. నటరాజ్ బిందును పర్సనల్‌గా అటాక్ చేస్తూ మీ తండ్రి నీ విషయంలో ఫెయిల్ అయ్యాడంటూ, సూర్పనక అంటూ ఆమెపై విరుచుకుపడ్డాడు. ఇక ఈరోజు నామినేషన్ ప్రాసెస్ తిరిగి కంటిన్యూ అవుతుంది. నటరాజ్ బిందును నామినేట్ చేస్తూ సూర్పనక నీ టైమ్ స్టార్ట్ అయింది. ప్రేక్షకులు నీ ముక్కు కోస్తారని చెప్తున్నాడు. మరి ఈవారం ఎవరెవరు నామినేషన్స్‌లో ఉంటారో టాప్ 5కి వెళ్లేదెవరో చూడాల్సి ఉంది.