దేశంలో కరోనా వ్యాప్తి ఎంతకూ ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. కొత్తగా 12,249 కేసులు వెలుగుచూశాయి. 9,862 మంది గత 24 గంటల్లో వైరస్ నుంచి కోలుకున్నారు. మరో 13 మంది మహమ్మారికి బలయ్యారు. దేశంలో ప్రస్తుతం 81,687 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 3.94శాతానికి పెరిగింది.