బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ వివాదంలో చిక్కుకున్నారు. ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్ కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చిన ఆమె జెండాను తప్పుగా పట్టుకున్నారు. జెండాను తిప్పి పట్టుకొని ప్రేక్షకులకు చూపించడంతో వివాదాస్పదం అయ్యింది. దీనిపై చాలామంది ఆగ్రహానికి గురవుతున్నారు. దేశాన్ని అవమానించారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఆమె విదేశీయురాలని.. తెలియకుండా జరిగిందంటూ కొందరు మద్దతుగా నిలుస్తున్నారు.