రూ.4,500 కోట్లు దోపిడీ చేసిన ఉత్తర కొరియా హ్యాకర్లు!

© Envato

ఉత్తర కొరియా ప్రభుత్వం తరపున పలువురు హ్యాకర్లు పనిచేస్తున్నట్లు అమెరికా FBI చెబుతోంది. ఈ క్రమంలో మార్చి 29న హ్యాకర్లు దాదాపుగా 600 మిలియన్ డాలర్ల(రూ.4,500 కోట్లు) క్రిప్టోకరెన్సీ దొంగిలించారని ప్రకటించింది. ఆటగాళ్లను అనుమతించే వీడియో గేమ్ యాక్సీ ఇన్ఫినిటీ నుంచి ఇది జరిగినట్లు తెలిపింది. పరిశోధన ద్వారా లాజరస్ గ్రూప్, APT38, DPRKతో సంబంధం ఉన్నట్లు పేర్కొంది. DPRK అనేది ఉత్తర కొరియా యొక్క అధికారిక పేరు. ప్యోంగ్యాంగ్‌తో సంబంధం ఉన్నవారు సైబర్ దోపిడీలో పాల్గొన్నట్లు వెల్లడించింది.

Exit mobile version