కెరీర్ ముగిసే లోపు కోహ్లీ 110 సెంచరీలు చేస్తాడని పాక్ మాజీ ప్లేయర్ షోయబ్ అక్తర్ బలంగా నమ్ముతున్నాడు. సచిన్ వంద సెంచరీల రికార్డును అధిగమిస్తాడని అక్తర్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘అప్పుడంటే కోహ్లీకి కెప్టెన్సీ భారం ఉండేది. అది విరాట్ ఆటపై ప్రభావం చూపించింది. ఇప్పుడు ఆ బాధ్యతలు లేవు. స్వేచ్ఛగా, మరింత శ్రద్ధగా విరాట్ బ్యాటింగ్ చేయగలడు. ఒక బీస్ట్ లాగా పరుగులు సాధించగలడు. 110 సెంచరీలు చేస్తాడని నాకైతే పూర్తి నమ్మకం ఉంది’ అని షోయబ్ అక్తర్ వెల్లడించాడు. 75 సెంచరీలతో విరాట్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు.