8నిమిషాలు కాదు.. 47 సెకన్లు

© ANI Photo

ఫాస్టాగ్‌తో టోల్‌ప్లాజాల వద్ద వేచి ఉండే సమయం గణనీయంగా తగ్గింది. అంతకుముందు సగటుగా 8నిమిషాల సమయం తీసుకుంటే.. ఫాస్టాగ్ వచ్చాక 47సెకన్లకు చేరుకుంది. ఈ విషయాన్ని కేంద్రమత్రి గడ్కరీ వెల్లడించారు. ఫాస్టాగ్‌ని ప్రవేశపెట్టాక టోల్ ప్లాజాల వద్ద రద్దీ తగ్గిందని ఆయన తెలిపారు. రానున్న కాలంలో ప్రవేశపెట్టే జీపీఎస్ టోల్ కలెక్షన్ల ద్వారా మరింత సమయం ఆదా అవుతుందన్నారు. ప్రయాణ దూరం ఆధారంగా ఈ టోల్‌ని వసూలు చేస్తామన్నారు.

Exit mobile version