బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలో దీక్ష చేయడం కాదు.. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ ఎదుట చేయాలని టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. ‘మహిళా గోస-బీజేపీ భరోసా’ కార్యక్రమంలో సంజయ్ మాట్లాడారు. ‘‘తెలంగాణలో మహిళలు అభద్రతాభావంలో ఉన్నారు. బయటికి వస్తే ఇంటికి తిరిగి వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో 17 శాతం అత్యాచారాలు పెరిగాయి. ప్రభుత్వ చర్యలు శూన్యం.’’ అంటూ తెలంగాణ ప్రభుత్వంపై సంజయ్ ధ్వజమెత్తారు.