‘ఉమ్మడి ఏపీ కాదు.. వైఎస్ ఫ్యామిలీని కలపండి’

Courtesy Twitter: POTHULA BALAKOTAIAH

ఉమ్మడి ఏపీని మేము ఎప్పుడూ కోరుకుంటామని వ్యాఖ్యానించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై అమరావతి బహుజన జేఏసీ చైర్మన్ పోతుల బాలకోటయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఏపీ అటుంచి.. ముందు జగన్, షర్మిలను కలపండి అంటూ సజ్జలపై మండిపడ్డారు. వైఎస్ కుటుంబాన్ని కలపలేని మీరు.. విడిపోయిన రాష్ట్రాలను ఎలా కలుపుతారని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే వైఎస్సార్సీపీ కొత్త నాటకానికి తెర లేపిందని ఆరోపించారు.

Exit mobile version