పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఖుర్రమ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా బ్యాటర్ కింగ్ కోహ్లీతో తనను తాను పోల్చుకుంటూ కోహ్లీ కన్నా తానే బెటర్ అంటూ అవివేకంగా డప్పు కొట్టుకున్నాడు. 50 ఓవర్ల క్రికెట్లో కోహ్లీ కన్నా తానే బెటర్ అని తన రికార్డులు కోహ్లీ కన్నా మెరుగని చెప్పుకొచ్చాడు. కోహ్లీ ప్రతి 6ఇన్నింగ్స్‌కు సెంచరీ చేస్తే తాను ప్రతి 5.68ఇన్నింగ్స్‌కే సెంచరీ చేశానన్నాడు. ఇంతకీ ఇతగాడు ఆడింది ఎన్ని మ్యాచ్లంటో ఖుర్రమ్ లిస్ట్-ఏ క్రికెట్లో 166 మ్యాచ్‌ల్లో 53 సగటున 27 శతకాల సాయంతో 7992 పరుగులు చేశాడు. కేవలం 7 ODIలు ఆడిన ఖుర్రమ్ 3 హాఫ్ సెంచరీలు చేశాడు.