విజయ్ దేవరకొండ, తాను మంచి స్నేహితులమేనని రష్మిక మందన్న మరోసారి క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం రిలేషన్షిప్ గురించి ఆలోచించేంత సమయం లేదంది. ‘15మంది స్నేహితులం కలిసి మాల్దీవులకి వెళ్లాం. విజయ్‌తో సన్నిహితంగా ఉంటా. సినిమాల విషయంలో వచ్చే సందేహాలను విజయ్‌నే అడుగుతా. అన్ని విషయాలను పంచుకుంటాం. చర్చించుకుంటాం. అయితే, రిలేషన్షిప్ గురించి ఆలోచించేంత సమయం లేదు. పని మీదే దృష్టి పెట్టా. ప్రేమ అనేది సహజంగా పుడుతుంది’ అని వీరిద్దరి మధ్య వస్తున్న రూమర్లపై రష్మిక క్లారిటీ ఇచ్చింది. వీరిద్దరు కలిసి ఇటీవల మాల్దీవులకు వెళ్లారు.
అంత టైం లేదు: రష్మిక

Screengrab Instagram: