సాధారణంగా మహిళలు వట సావిత్రి పౌర్ణమి సందర్భంగా, ఏడు జన్మలకు ఒక్కరే భర్తగా రావాలని పూజలు చేస్తుంటారు. అయితే భార్య బాధితులు మాత్రం తమకు ఏడు జన్మలు కాదు, ఏడు సెకండ్లు కూడా ఒక్కరే భార్యగా ఉండకూడదని పూజలు చేశారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన కొందరు తమకు ఒక్కరే భార్యలు ఉండకూడదని వట సావిత్రి పౌర్ణమి సందర్భంగా రావి చెట్టు చుట్టూ 108 ప్రదిక్షిణలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.