తెలంగాణ ఆడబిడ్డల నుంచి కన్నీళ్లు రావని..నిప్పులు కురుస్తాయని ఎమ్మెల్సీ కవిత విరుచుకుపడ్డారు. ప్రశ్నించే వారే లక్ష్యంగా బీజేపీ చేస్తున్న దాడులకు వెరవబోమని స్పష్టం చేశారు. హైదరాబాద్లో జాగృతి విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. బీజేపీపై తిరుగుబాటుకు తెలంగాణ తరహా ఉద్యమాన్ని దేశమంతా నిర్మిస్తామని కవిత వ్యాఖ్యానించారు. కేంద్రం నియంతృత్వ పోకడలపై ప్రజా ఉద్యమం నిర్మిస్తామని పేర్కొన్నారు. కవులు, కళాకారులు, మేధావులు, రైతులతో గ్రామ గ్రామాన చర్చలు పెడతామని వెల్లడించారు.