ప్రస్తుతం యాపిల్ బ్రాండ్ ఐ ఫోన్లను మించిన స్మార్ట్ ఫోన్స్ లేవు. దీంతో వీటికి పోటీగా లండన్ టెక్ కంపెనీ నథింగ్ (Nothing) సరికొత్త ఫోన్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ ఏడాది వేసవిలో ఈ బ్రాండ్ నుంచి తొలి స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ హెడ్ కార్ల్ పీ ప్రకటించారు. తాజాగా జరిగిన నథింగ్ ఈవెంట్లో భాగంగా ఆయన నథింగ్ ఫోన్ 1 లాంచింగ్‌ను అధికారికంగా ప్రకటించడంతో పాటు మరిన్ని వివరాలను రివీల్ చేశారు. కార్ల్ పీ గతంలో వన్‌ప్లస్ బాస్‌గా వ్యవహరించాడు. కానీ, వన్‌ప్లస్‌ను కాకుండా యాపిల్ సంస్థను టార్గెట్ చేశారు కార్ల్. యాపిల్‌కు ప్రత్యామ్నాయంగా గట్టి పోటీని ఇస్తూ ఎదగడమే తమ లక్ష్యమని కార్ల్ పీ చెప్పారు. ఇందులో నథింగ్ ఓఎస్ (Nothing OS) ఉంటుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోన్ ను జులై, ఆగస్టు నెలలో విడుదల కానుంది.