మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. పులివెందులలో అధికారులు నోటీసులు అందించారు. మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. వీటిపై స్పందించిన అవినాశ్…విచారణకు అన్ని విధాల సహకరిస్తానని తెలిపారు. బిజీ షెడ్యూల్ ఉన్నందునా రాలేనని… మరో తేదీ నిర్ణయించాలని కోరారు.