నేడు 1569 పోస్టులకు నోటిఫికేషన్

© File Photo

తెలంగాణలోని పల్లె, బస్తీ దవాఖానాల్లో 1569 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్స్(MLHP) పోస్టులకు ప్రభుత్వం నేడు నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. ఈ మేరకు ఆయా జిల్లాల్లోని ఖాళీల ఆధారంగా కలెక్టర్లు రిలీజ్ చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 1220, పట్టణ ప్రాంతాల్లో 349 MLHP ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఇప్పటికే వైద్య ఆరోగ్య, కుటుంబ సక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి ఆయా కలెక్టర్లకు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శల ప్రకారం యునానీ, హోమియోపతి, నేచురోపతి అభ్యర్థులు ఈ పోస్టులకు అనర్హులని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Exit mobile version